5జీ టవర్ పేరిట మోసపోయిన రైతు..

Update: 2023-03-16 13:19 GMT

దిశ, మహమ్మదాబాద్/గండీడ్: సెల్ టవర్ వేస్తామంటూ ఓ రైతును మోసం చేసిన ఘటన మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ ఎస్ఐ సైదయ్య వివరాల ప్రకారం.. గండీడ్ కు చెందిన మైపాల్ గౌడ్ అనే రైతుకు ఈనెల తేదీ 01 ఫిబ్రవరి 2023 నాడు అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. పొలంలోని టవర్‌కు 5జీ సర్వర్ అప్‌లోడ్ చేస్తామని తెలిపాడు.

దీంతో నెలకు రూ. 10 వేలు ఆదాయం వస్తుందని నమ్మించాడు. సదరు రైతుకు ఫోన్‌లో డాక్యుమెంట్ పంపించగా.. అతని ఖాతా నుంచి రూ. 52, 650 కాజేశాడు. దీంతో రైతు మోసపోయానని గ్రహించి.. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్సై సైదయ్య తెలిపారు.

Tags:    

Similar News