భారీగా నల్ల బెల్లం పట్టివేత.. ఇద్దరు సప్లయర్స్ పై కేసు నమోదు
ప్రభుత్వ అదేశాలతో ఎక్సైజ్‌శాఖ నాటుసారాను ఆగస్టు 31 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో విస్తృతంగా దాడులు చేస్తున్నామని నాగర్ కర్నూల్ సీఐ తెలిపారు.
దిశ, బిజినేపల్లి: ప్రభుత్వ అదేశాలతో ఎక్సైజ్‌శాఖ నాటుసారాను ఆగస్టు 31 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో విస్తృతంగా దాడులు చేస్తున్నామని నాగర్ కర్నూల్ సీఐ తెలిపారు.నాటుసారా తయారీని ప్రోత్సహించి లబ్ది లబ్ధిపొందాలని, పల్లెలకు నాటుసారా తయారీకి వినియోగించే నల్ల బెల్లం సరఫరా చేసే ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.
వివరాల్లోకి వెళితే..
కర్నూల్ నుంచి చాలా కాలంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మరియు కొల్లాపూర్ ప్రాంతాలకు నాటుసారాకు వినియోగించే బెల్లం, పటికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి మరో వ్యక్తి పరారీలో ఉన్నారని తెలిపారు. మహబూబ్ నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు పక్కాగా అందుకున్న సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున బిజినపల్లి బస్ స్టాండ్ దగ్గర రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు కర్నూల్ నుంచి వచ్చిన బొలెరో పిక్ అప్ వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించగా అందులో ఉన్న 75 బ్యాగుల బెల్లం, ఒక బ్యాగులో 30 కేజీలు మొత్తం 2250 కేజీల బెల్లాన్ని, 5 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఇట్టి బెల్లాన్ని సరఫరా చేస్తున్న దేవుల తిరుమలపూర్ గ్రామం, పెద్దకోత్తపల్లి మండలానికి చెందిన పుట్ట శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. వట్టిపల్లి తండా, తెలకపల్లి మండలం కు చెందిన ముడావత్ ప్రతాప్ పరారీలో ఉన్నాడు.అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని నాగర్ కర్నూలు ఆబ్కారీ స్టేషన్ సిఐ జీ. కళ్యాణ్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ప్రకారం వాహనం, బెల్లం విలువ రూ. 12 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. బెల్లాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ మెంట్ ఏఈఎస్ శ్రీనివాస్, సీఐలు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శారద, ఎస్సై సృజన్ రావు తోపాటు సిబ్బంది చంద్రయ్య, సూర్యం, మునిందర్, జనార్దన్ పాల్గొన్నారు. బెల్లం సరఫరా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ మెంట్ అధికారులను మరియు సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అసిస్టేంట్ కమిషనర్ విజయ భాస్కర్‌రెడ్డి అభినందించారు.