510 బస్తాల నల్లబెల్లం స్వాధీనం

తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాలలో అక్రమంగా నల్ల బెల్లం సరఫరా చేస్తున్న క్రమంలో గద్వాల ఎక్సైజ్, డిటిఎఫ్ బృందం దాడులు నిర్వహించారు.

Update: 2024-02-12 16:18 GMT

దిశ, గద్వాల: తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాలలో అక్రమంగా నల్ల బెల్లం సరఫరా చేస్తున్న క్రమంలో గద్వాల ఎక్సైజ్, డిటిఎఫ్ బృందం దాడులు నిర్వహించారు. 510 బస్తాలలో రూ.10 లక్షలు విలువ చేసే 153 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గద్వాల్ ఎక్సైజ్ సీఐ గోపాల్ కథనం మేరకు సోమవారం ధరూర్ మండలం పరిధిలోని పలు గ్రామాలలో లారీలో నల్లబెల్లం తెచ్చి విక్రయిస్తున్నట్లు గద్వాల్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందడంతో కొత్తపాలెం స్టేజ్ వద్ద ఆ లారీని తనిఖీ చేయగా అందులో నల్లబెల్లం గుర్తించారు. తమిళనాడుకు చెందిన మోహన్ రాజ, సురేష్ శెట్టి అనే ఇద్దరు‌ వ్యక్తులు సేలం నుంచి లారీలో నల్లబెల్లం తెచ్చి గద్వాల్ జిల్లాలో ధరూర్ మండలంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని గద్వాల్ ఎక్సైజ్ సీఐ గోపాల్ తెలిపారు. 510 బస్తాలలో సుమారు‌ రూ.10లక్షలు విలువ చేసే 153క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు.


Similar News