కామారెడ్డి జిల్లాలో లంపి స్కిన్ వైరస్ కలకలం

కామారెడ్డి జిల్లాలో లంపి స్కిన్ వైరస్ కలకలం రేపుతోంది.

Update: 2023-02-16 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో లంపి స్కిన్ వైరస్ కలకలం రేపుతోంది. కామారెడ్డి మార్కెట్‌లో ఆవుకు లంపి స్కిన్ వైరస్ సోకగా రెండు రోజుల క్రితం వైరస్ కారణంగా ఆవు మృతి చెందింది. కాగా తాజాగా లంపిస్కిన్ సోకి మరో లేగ దూడ మృతి చెందింది. లంపి స్కిన్ వైరస్ సోకిన వందలాది ఆవులు రోడ్లపైనే తిరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు.

లింపి స్కిన్ వైరస్ ఈగల కారణంగా పశువులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వైరస్ కారణంగా పశువుల చర్మంపై ఎర్రటి బొడిపెలు కనిపిస్తాయి. ఇవి పుండ్లుగా మారి శరీరమంతా వ్యాపిస్తాయి. దీంతో తీవ్ర జ్వరం వచ్చి.. పశువులు పాలు ఇవ్వడం, గడ్డి తినడం మానేస్తాయి.

లంపిస్కిన్ పశువుల నుంచి మానవులకు సంక్రమించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఐవీఆర్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కేపీ సింగ్ తెలిపారు. పాలిచ్చే దూడకు సోకిన వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ వస్తుందన్నారు. 

Tags:    

Similar News