HYD: లూలు మాల్‌లో రెచ్చిపోయిన కస్టమర్లు (వీడియో)

హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇటీవలే ప్రారంభమైన లూలు మాల్‌లో కస్టమర్లు రెచ్చిపోయారు. కొత్తగా ప్రారంభమైన ఈ మాల్‌ను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన కస్టమర్లు లులు మాల్‌ను లూటీ చేశారు.

Update: 2023-10-03 07:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇటీవలే ప్రారంభమైన లూలు మాల్‌లో కస్టమర్లు రెచ్చిపోయారు. కొత్తగా ప్రారంభమైన ఈ మాల్‌ను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన కస్టమర్లు లులు మాల్‌ను లూటీ చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ మాల్‌కు పోటెత్తిన జనం మాల్‌లో ఉన్న తినుబండరాలను స్వాహా చేశారు. వివిధ ఫుడ్ ప్యాకెట్లతో పాటు కూల్ డ్రింక్ సీసాలను సైతం ఖాళీ చేసి అక్కడే పారేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నిర్వాహకులు కూడా కస్టమర్లపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం చూసిన నెటిజన్లు మన పరువు తీశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లులు మాల్ కారణంగా గత వారాంతంలో కూకట్ పల్లి ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్‌తో నగర వాసులు నరకయాతన పడిన సంగతి తెలిసిందే.

వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/cCE0FiW-oNo

Tags:    

Similar News