ఎన్నికల్లో ఓడిపోవడం మంచిదే.. కొత్త అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
పోటీలో నిలిచిన వారందరూ విజయం సాధించరు. ఏ ఆటలోనైనా.. ఇతర ఏ కాంపిటేషన్‌లోనైనా ఇది సహజం.
దిశ, వెబ్‌డెస్క్ : పోటీలో నిలిచిన వారందరూ విజయం సాధించరు. ఏ ఆటలోనైనా.. ఇతర ఏ కాంపిటేషన్‌లోనైనా ఇది సహజం. ప్రతి గేమ్‌లో గెలుపు ఓటములు ఉంటాయి. కానీ విజయం సాధించిన వారికంటే ఓటమిపాలైన వాళ్లలో పట్టుదల పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితం అయింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తననే ఉదాహారణ తీసుకోండి అంటూ ఓ కొత్త నిర్వచనాన్ని చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితులతో హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోవడం మంచిదే అన్నారు. ఓడిపోవడం వల్ల పెద్ద విజయాలు వస్తాయని చెప్పుకొచ్చారు.
2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తను 2019లో ఎంపీ అయ్యానన్నారు. అదే ఊపుతో 2023లో సీఎం అయ్యానని తెలిపారు. జీవన్ రెడ్డి కూడా 2023లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడని.. ప్రస్తుతం జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి.. రేపు కేంద్రమంత్రి అవుతాడని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. చిన్న పదవులను ఓడిపోవడం వల్ల పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉందనే అర్థంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా నిజామాబాద్‌లో జీవన్ రెడ్డి గెలవడంతోపాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జీవన్ రెడ్డి కేంద్రమంత్రి కావడం రెండు నెలల్లో జరిగిపోతుందని సీఎం చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఆయన కామెంట్స్‌పై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.
Read More..
కొన్ని సార్లు ఓడినా మంచే జరుగుతుంది.. అలాగే జీవన్ రెడ్డికి కూడా!.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు