TGSRTC: బస్టాప్‌లో పుట్టిన చిన్నారికి జీవితకాలం ఫ్రీ బస్ పాస్..! అందజేసిన సిబ్బంది
కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో ఇటీవల పుట్టిన చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్‌ను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అందజేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో ఇటీవల పుట్టిన చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్‌ను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అందజేసింది. స్థానిక ఆస్పత్రిలో కుటుంబసభ్యులను ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ అధికారుల బృందం శనివారం కలిసింది. ఆడపిల్లకు బస్ పాస్ తో పాటు వారికి రూ.14 వేల ఆర్థిక సాయం, వస్త్రాలను అందజేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం తో పాటు వస్త్రాలను అందజేసి గొప్ప మనసు చాటుకున్న ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. అలాగే, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూసి మానవతా దృక్పథంతో స్పందించి కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బందికి మరోసారి సంస్థ అభినందనలు తెలియజేస్తోందని పేర్కొన్నారు. సమయస్పూర్తితో వ్యవహరించి సకాలంలో స్పందించిన మీ సేవా ఆదర్శనీయమని హర్షం వ్యక్తంచేశారు.