లేడీ ఆఫీసర్ జగజ్యోతి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి వద్ద భారీగా నగదు బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు.

Update: 2024-02-20 09:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి వద్ద భారీగా నగదు బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఓ వ్యవహారంలో సంతకం కోసం బాధితుడి వద్ద నిన్న రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ ఆమె ఇంట్లో సోదారు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆమె ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లు కనుగొన్నారు. రూ. 65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జగజ్యోతి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును మరింత లోతుగా విచారించనున్నారు. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్ గూడా జైలుకు తరలించారు.

Tags:    

Similar News