Big Breaking: T- కాంగ్రెస్ బిగ్ షాక్.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కీలక నేత
చేరికలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీ- కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగలింది.
దిశ, వెబ్‌డెస్క్: చేరికలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీ- కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగలింది. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. కేసీఆర్ అనిల్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుతో విసుగు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.