కీలక నేతలు పార్టీని వీడుతున్న వేళ KTR సంచలన ప్రకటన

పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.

Update: 2024-03-29 03:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకేసారి ఇద్దరు ముగ్గురు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుండటంతో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని జిల్లాలోని సెకండ్ కేడర్ లీడర్లు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లోపు పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘‘శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్.. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు.ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం.. జై తెలంగాణ.. జై కేసీఆర్’’ అని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.  

Tags:    

Similar News