KTR: కేటీఆర్ ఈ దాడుగుమూతలేంది?.. బీజేపీ ఎంపీ పేరు చెప్పకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్ల చర్చ
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ ఎంపీ పేరును కేటీఆర్ చెప్పకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కంచ గచ్చిబౌలి భూములపై (Kancha Gachibowli Lands) పొలిటికల్ దుమారం చల్లారడం లేదు. ఈ భూములు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ భూముల విషయంలో ఆర్థిక మోసం జరిగిందని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిందని దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే కేటీఆర్ (KTR) చేసిన విజ్ఞప్తిపై విషయంలో నెటిజన్ల వాదన పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆర్థిక మోసానికి ఓ బీజేపీ ఎంపీ సహకారం ఉందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా విచారణ కోరుతూ మోడీని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ లోనూ సదరు బీజేపీ ఎంపీ పేరు, ఆ అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
కేటీఆర్ వి ఉత్తుత్తి ఆరోపణలేనా?:
కంచగచ్చిబౌలి భూముల విషయంలో కేటీఆర్ ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన ఓ ఎంపీ రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతికి సహకారం అందించారని గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన కామెంట్స్ తీవ్ర రచ్చకు కారణం అయ్యాయి. అయితే ఆ ఎంపీ ఎవరనే విషయంలో మాత్రం కేటీఆర్ కాన్ఫిడెన్షియల్ మెయింటెన్ చేస్తున్నారు. దీంతో కేటీఆర్ ఆరోపణలు నిజమే అయితే ఆ పేరు భయటపెట్టేందుకు ఎందుకు వెనకాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సీఈసీ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధానిని కోరిన కేటీఆర్.. బీజేపీ ఎంపీ విషయాన్ని ఎందుకు స్కిప్ చేశారనే గుసగుసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సదరు ఎంపీ పేరు చెప్పాలని మీడియా సమావేశంలో విలేకర్లు అడుగగా అది మీరే ఇన్వెస్ట్ గేషన్ చేయాలంటూ కామెంట్ చేశారే తప్ప ఆ ఎంపీ ఎవరనేది మాత్రం రివీల్ చేయడం లేదు.
సొంతపార్టీలోనూ చర్చ:బీజేపీ ఎంపీ విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు గులాబీ పార్టీలోనూ చర్చనీయాశంగా మారింది. ఈ అవినీతి నిజమే అయితే? నిజంగానే బీజేపీ ప్రమోయం ఉంటే దాన్ని బయటపెట్టి కాంగ్రెస్, బీజేపీల పరస్పర సహకారంపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టవచ్చుకాదా అనే చర్చ సొంతపార్టీలోనూ వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ప్రధాన మంత్రి కామెంట్స్ తో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులను ఎండగట్టేందుకు ఉన్న మంచిఅవకాశాన్ని వదుకోవడం ఎందుకు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయట. అయినా కేటీఆర్ మాత్రం బీజేపీ ఎంపీ పేరు చెప్పకపోవడంతో కేటీఆర్ ఆరోపణలు అంతా ఉత్తవేనా? కేవలం రాజకీయ ఆరోపణల్లో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు వ్యక్తం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. దీంతో కంచగచ్చిబౌలి భూముల విషయంలో కేటీఆర్ సీక్రసీ మెయింటైన్ ఎంత కాలం ఉండబోతున్నదనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.