గుజరాత్ 'గిఫ్ట్' కంటే హైదరాబాద్ బెస్ట్.. కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్ లేఖ

డిజిటల్ టెక్నాలజీతో పాటు ఆన్‌లైన్ కామర్స్ వినియోగం పెరిగినందున డాటా సెంటర్ల అవసరం గతంలో ఎన్నటికంటే పెరిగిందని మంత్రి కేటీఆర్ అని వ్యాఖ్యానించారు.

Update: 2023-02-16 15:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : డిజిటల్ టెక్నాలజీతో పాటు ఆన్‌లైన్ కామర్స్ వినియోగం పెరిగినందున డాటా సెంటర్ల అవసరం గతంలో ఎన్నటికంటే పెరిగిందని గుర్తుచేసిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ వాటి హబ్‌లను నెలకొల్పడానికి హైదరాబాద్ బెస్ట్ సిటీ అని వ్యాఖ్యానించారు. వాటి హబ్‌లను నెలకొల్పడానికి హైదరాబాద్ బెస్ట్ సిటీ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీతో పోలిస్తే హైదరాబాద్ నగరం బెస్ట్ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో భూకంపాల ప్రమాదం ఉన్నదని, గతంలోని అనుభవాలూ ఆ తీవ్రతను హెచ్చరించాయని గుర్తుచేశారు. అంతర్జాతీయ సరిహద్దు ఉన్నందున రక్షణ, భద్రతాపరంగానూ సమస్యాత్మకం అని పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే హైదరాబాద్‌కు ఆ రెండు ప్రమాదాలూ లేవని, సేఫెస్ట్ సిటీ అని వివరించారు.

అంతర్జాతీయ డాటా రాయబార కార్యాలయాల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం లోతుగా ఆలోచించాలని ఆ లేఖలో కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కీలకమైన ఇలాంటి డాటా సెంటర్లను దేశంలోని ఒకే నగరంలో కేంద్రీకరించడానికి బదులుగా వేర్వేరు నగరాల్లో ఏర్పాటు చేయడం ఉత్తమంగా ఉంటుందని పేర్కొన్నారు. ఒకే చోట ఏర్పాటు చేయడంలోని నష్టాలను కూడా వివరించారు. ఈ నెల 1న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్‌లో ఇంటర్నేషనల్ డాటా రాయబార కార్యాలయాన్ని గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించడంతో కేటీఆర్ ఈ లేఖ రాశారు. భూకంపాలు ఎక్కువ వచ్చే రాష్ట్రాల్లో గుజరాత్‌ కూడా ఉన్నదని, అలాంటి ప్రాంతాల్లో డేటా ఎంబసీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల నష్టాలు తప్పవన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ నగరాన్ని డేటా సెంటర్‌కు సూటబుల ప్లేస్‌గా గుర్తించి పునఃపరిశీలించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.

దేశంలోనే తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో హైదరాబాద్‌ నగరం ఒకటని, ఈ ప్రాంతం డేటా సెంటర్‌ ఏర్పాటుకు అనువైన ప్రదేశమని తెలిపారు. గుజరాత్‌ రాష్ట్ర సరిహద్దు మరో దేశంతో లింక్ అయి ఉన్నదని, డేటా సెంటర్ల భద్రతకు ప్రమాదకరమన్నారు. ఎంబసీ కేంద్రాల ఏర్పాటు సమయంలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసే సమయంలో క్లయింట్ల భద్రతను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ అనువైన నగరమని, గ్లోబల్ డేటా సెంటర్ మేజర్లు తమ భారీ డేటా సెంటర్ల ఏర్పాటులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని గుర్తుచేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ మొదలు మైక్రోసాఫ్ట్ అజూర్ వరకు రాష్ట్రం అనేక హైపర్ స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్లు హైదారబాద్‌లో ఉన్నాయని ఉదహరించారు. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే డేటా సెంటర్‌ పాలసీని తీసుకువచ్చిందని గుర్తుచేశారు.


Tags:    

Similar News