జైనూర్‌లో విధ్వంసంపై స్పందించిన కేటీఆర్‌

కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడి, హత్యాయత్నం చేశాడు.

Update: 2024-09-05 06:05 GMT
జైనూర్‌లో విధ్వంసంపై స్పందించిన కేటీఆర్‌
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై ఓ వర్గానికి చెందిన వ్యక్తి లైంగిక దాడి, హత్యాయత్నం చేశాడు. కాగా ఈ ఘటనలో నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని అధివాసి సంఘాల వారు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో నింధితుడి వర్గానికి చెందిన వర్గం, ఆధివాసి వర్గం మధ్య అల్లర్లు చెలరేగాయి. కాగా ఈ ఘటనలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గిరిజన మహిళపై అత్యాచారయత్నం దారుణమని.. బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటోందని.. ఉద్రిక్తతలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని.. జైనూర్‌లో తక్షణం శాంతి నెలకొల్పాలని కేటీఆర్‌ అన్నారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని.. కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా వారం రోజులుగా జైనూర్ అట్టుడికి పోతుండగా.. 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు ఇంటర్నెట్ కట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలు పోస్ట్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


Similar News