KTR: అరెస్టులకో.. బెదిరింపులకో భయపడం.. కొణతం దిలీప్ అరెస్ట్ పై కేటీఆర్

నీ అక్రమ అరెస్టులకో.. ఉడత బెదిరింపులకో భయపడమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు.

Update: 2024-11-18 12:36 GMT

దిశ, వెబ్ డెస్క్: నీ అక్రమ అరెస్టులకో.. ఉడత బెదిరింపులకో భయపడమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా(Telangana Digital Media) మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్(Konatham Dilip) ను ఇవాళ సీసీఎస్ పోలీసులు అదుపులోకి(Arrest) తీసుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నిస్తే సంకెళ్లు.. నిల‌దీస్తే అరెస్టులు చేస్తున్నారని, తెలంగాణ లో నియంత రాజ్యం.. నిజాం రాజ్యాంగ‌ం నడుస్తున్నాయని మండిపడ్డారు.

అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ ను అరెస్ట్ చేశారని, విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని, తాము ప్రజాస్వామ్య ప్రేమికులమని, ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఇక మీ అక్రమ అరెస్టులకో.. ఉడత బెదిరింపులకో.. భయపడమని, మీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ! అని మాజీమంత్రి రాసుకొచ్చారు.

Tags:    

Similar News