400 ఎకరాల ఇష్యూ వెనక టీ బీజేపీ ఎంపీ.. వెయిట్ అండ్ సీ!
రెండ్రోజుల్లో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండ్రోజుల్లో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి 400 ఎకరాల ఇష్యూ వెనక ఓ తెలంగాణ బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
వర్నర్ బిల్లుల నిలిపివేత విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అదేవిధంగా ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి ధర్మాసనం చీవాట్లు పెట్టింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తామని జస్టిస్ జెబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వానికి కోర్టులో ఘన విజయం దక్కింది. సుప్రీం కోర్టు ఏం చెప్పిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీలో ఉన్న కార్ల కంపెనీ కియాలో కార్ల ఇంజిన్లు మాయం కావడం సంచలనం కలిగిస్తోంది. శ్రీ సత్య సాయి జిల్లాలోని కంపెనీలో ఏకంగా 900 ఇంజిన్లు దొంగతనానికి గురవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన గత నెలలో జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కియా యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ ఘటనలో రాష్ట్రంలో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం కొద్దిరోజులుగా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇందుకు సంబంధించిన పోస్టులు, వీడియోలే కనిపిస్తున్నాయి. నెటిజన్లు ముగ్గురు అక్కాచెల్లెళ్లను దారుణంగా ట్రోల్ చేస్తుండగా వారు సైతం అదేస్థాయిలో బదులిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అలేఖ్య ఆస్పత్రి ఐసీయూలో ఉన్న వీడియోను ఆమె సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్రోలింగ్‌ను తట్టుకోలేక అలేఖ్య ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైందని అందుకే ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె నెటిజన్లకు కీలక విజ్ఞప్తి చేసింది. అదేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.