Konda Vishweshwar Reddy: బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
Konda Vishweshwar Reddy Announces to be joined BJP| మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. గురువారం ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది
దిశ, వెబ్‌డెస్క్ : Konda Vishweshwar Reddy Announces to be joined BJP| మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. గురువారం ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్‌కు అంత శక్తి లేదన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పడిపోయిందని, తెలంగాణ వాదులను కేసీఆర్ మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో టీఆర్ ఎస్ కార్యకర్తల దోపిడి ఎక్కువైంది, కేసీఆర్ పక్కన పువ్వాడ, తలసాని, సబిత లాంటి వాళ్లు ఉన్నారు, టీఆర్‌ఎస్ తొందర్లోనే ఖతం అవుతుందని, యాంటీ కేసీఆర్ ఓటు బీజేపీకి వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈయన 2013లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన టీఆర్ఎస్‌లో చేరి చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. గతేడాది మార్చిలో కాంగ్రెస్‌లో నాయకత్వలోపం ఉందంటూ పార్టీకి రాజీనామా చేసేశారు.