మంత్రి కేటీఆర్కు కోమటిరెడ్డి సవాల్.. దమ్ముంటే అది నిరూపించాలని ట్వీట్!
మంత్రి కేటీఆర్కు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్కు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. తమ పార్టీలో చేరేందుకు మునుగోడులో ఒక వ్యక్తికి బీజేపీ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చింది వాస్తవం కాదా అని మంత్రి కేటీఆర్ చేసి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి శుక్రవారం రియాక్ట్ అయ్యారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కేటీఆర్కు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే నేను బీజేపీలో చేరినందుకు రూ.18,000 కోట్ల కాంట్రాక్టు పొందానని నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. గోబెల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే అది తన విషయంలో పనిచేయదని గుర్తుంచుకోవాలన్నారు. కాగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన కేటీఆర్ విపక్షాలు లేకుండా చేయాలనేదే మోడీ ప్రధాన ఉద్దేశం అని, అవినీతి ఆరోపణలున్న అనేక మంది బీజేపీలో చేరగానే పునీతులవుతున్నారని విమర్శించారు.
KTR if you have an iota of credibility and honesty, once again I challenge you to prove that I got the 18000 cr contract for joining BJP and don’t think Goebbels propaganda will work in my case.
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) March 10, 2023