రికార్డు స్థాయిలో కిడ్నీ ఆపరేషన్లు.. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్లే ఎక్కువ..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ట్రాన్స్ప్లాంటేషన్స్(బతికి ఉన్న మనిషి నుంచి మరోక పేషెంట్ కు అవయవాలు మార్చడం) ఎక్కువ జరుగుతున్నాయి. 2013 నుంచి 2022(మార్చి) వరకు ఏకంగా 4,147 అవయవ మార్పిడిలు జరిగాయి. అత్యధికంగా కిడ్నీలు 3075, లివర్1072 మార్పిడి జరిగాయి.వీటిలో ఒక్క నిమ్స్ఆసుపత్రిలోనే 577 లైవ్ట్రాన్స్ప్లాంటేషన్లు జరగడం గమనార్హం. రికార్డు స్థాయిలో కిడ్నీ ఆపరేషర్లు జరిగాయి.ఇక ప్రభుత్వం ఆధీనంలో నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులలో కాడవర్(మరణించిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి ఇతర పేషెంట్‌కు ఇవ్వడం)విధానంలో సర్జరీలు జరుగుతున్నాయి.2013 నుంచి 2023 వరకు నిమ్స్ లో 372, ఉస్మానియాలో 71, గాంధీలో 11 సర్జరీలు నిర్వహించి ఆర్గాన్స్మార్చారు.
1211 మంది నుంచి..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వాసుపత్రి పరిధిలో ఇప్పటి వరకు 4,564 అవయవ మార్పిడిలు జరిగాయి.1211 మంది డోనర్లు నుంచి ఆర్గాన్స్‌ను సేకరించారు.వీటిలో 1815 కిడ్నీలు, 1114 లివర్లు,173 హార్ట్‌లు, 1075 కార్నియాస్,170 హార్ట్ వాల్వ్స్ ,205 లంగ్స్,12 ప్రాంకీస్లను ఆపరేషన్లు చేసి అవసరమైన పేషెంట్లకు ఆమర్చారు.ఈ ప్రక్రియ అంతా జీవన్దాన్పర్యవేక్షణలో జరిగింది. ఆన్లైన్ లో అప్లై చేసినోళ్లకు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే పేషెంట్లకు అవయవ మార్పిడిలు చేస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.