నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ప్రజల పై జులూం చేయలేదు
నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ప్రజలపై కానీ యువకులపై కానీ పోలీస్ జులూం చేయలేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
దిశ, ఖమ్మం : నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ప్రజలపై కానీ యువకులపై కానీ పోలీస్ జులూం చేయలేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం నగరంలోని 40వ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అల్ సాద్ నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అధికార పార్టీలో ఉన్న నాయకులపై ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
సాద్ 9 సంవత్సరాలు పార్టీ కోసం పని చేసినా సరైన గుర్తింపు ఇవ్వలేదని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి యువకులకు సరైన ప్రాధాన్యత కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని తుమ్మల తెలిపారు. అనంతరం సాద్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ కమర్తపు మురళీ, నాయకులు చావా నారాయణరావు, ఖాదర్ బాబా ,మియాభాయ్, సాద్ యూత్ సభ్యులు వాజీద్ , ఇమామ్, రీయాజ్, ఖాదర్ బాబా అజ్మతుల్ల, జకీరుల్లా, అలీం, ఆఫ్రోజ్ తో పాటు పట్టణానికి చెందిన యువత పెద్ద ఎత్తున పాల్గొని తుమ్మల నాగేశ్వరరావుకు స్వాగతం పలికారు.