సింగరేణి బాధితులకు న్యాయం చేస్తాం : సత్తుపల్లి ఎమ్మెల్యే

దేశం అభివృద్ధి కోసం సింగరేణి సంస్థ కు భూములు ఇచ్చి త్యాగం చేసిన

Update: 2024-10-04 13:20 GMT

దిశ,సత్తుపల్లి : దేశం అభివృద్ధి కోసం సింగరేణి సంస్థ కు భూములు ఇచ్చి త్యాగం చేసిన సింగరేణి బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మమిల్ ఖాన్ అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఆహ్వానం మేరకు సత్తుపల్లి కిష్టారం సింగరేణి నిర్వాసితుల గోడు వినేందుకు మొదటి సారి వచ్చిన జిల్లా కలెక్టర్ ముందుగా సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన సైలో బంకర్ నుంచి వెలువడుతున్న పొల్యూషన్ పరిసర ప్రాంతాలను సందర్శించి బాధితులను వివరాల అడిగి తెలుసుకున్నారు. జే వి ఆర్ ఓ సి సింగరేణి బాంబు బ్లాస్టింగ్, గత భారీ వర్షాలతో దెబ్బతిన్న ఎస్సీ, బీసీ, కాలనీలలో ఇళ్లను పరిశీలించి,బాదితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఆవరణలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ , కిష్టారం వెంగళరావు నగర్, చెరుకుపల్లి, కొమ్మేపల్లి, ఎన్టీ ఆర్ నగర్, సింగరేణి నిర్వాసితులకు బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు మొట్టమొదటిసారి అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ కు మీ సమస్యలను వివరించేందుకు కృషి చేయడం జరిగిందని ముగ్గురు మంత్రుల సహాయ సహకారాలతో తప్పకుండా సింగరేణి నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు.

అనంతరం కలెక్టర్ ముజ్మమిల్ ఖాన్ మాట్లాడుతూ, సింగరేణి బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యంగా సైలో బంకర్లతో వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించడానికి స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నివారణ చర్యలు చేపట్టినప్పటికీ పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు సింగరేణి సీఎండీ, జీఎం , ఎమ్మెల్యే తో కలిసి ప్రణాళిక బద్ధంగా ఆధునిక టెక్నాలజీతో బంకర్ నుంచి వెలుపడే కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతామని, జే వి ఆర్ ఓ సి, కిష్టారం సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ తో దెబ్బతిన్న ఇళ్లను అదే ప్లేస్ లో రీప్లేస్ చేసుకునేందుకు సింగరేణి సంస్థ కొంత నిధులు సమకూర్చిందని మరింత నిధులు సమకూర్చి కేటాయించి ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రణాళిక బద్ధంగా వేగవంతంగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సింగరేణి బాధితులకు మొదటి ప్రాధాన్యతగా విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించి పాఠశాల భవన నిర్మాణాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి వంట చెట్లు, సోలార్ పవర్ తో విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం , డ్రింకింగ్ వాటర్, 340 మంది విద్యార్థుల చదువులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరంతరం డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, కల్లూరు ఆర్డీవో రాజేందర్ గౌడ్, సింగరేణి ఏజీఎం షాలెం రాజ్, కిష్టారం ఓసిపిఓ నరసింహారావు, సత్తుపల్లి తాసిల్దార్ యోగేశ్వరరావు, ఎంపీడీవో ఆర్ చిన్న నాగేశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్నేహలత, పలువురు ప్రభుత్వ అధికారులు సింగరేణి అధికారులు,సింగరేణి యూనియన్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Similar News