సింగరేణి బాధితులకు న్యాయం చేస్తాం

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్ల ప్రజలకు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

Update: 2024-09-10 14:37 GMT

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్ల ప్రజలకు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. గ్రామంలో వర్షంతో దెబ్బతిన్న ఇళ్లను ఆమె పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాసం పొందుతున్న బాధితులను కలిసి వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

    సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సమస్య ఆరు నెలల్లో పరిష్కరించకుంటే బాధితుల తరుపున ఎమ్మెల్యేగా పోరాటం చేస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సింగరేణి జీఎం షాలేంరాజు, సింగరేణి పీఓ నరసింహారావు, కల్లూరు ఆర్డీవో రవీంద్ర, సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు, పట్టణ సీఐ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, సింగరేణి ఉద్యోగులు కిష్టారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News