చీకట్లోనే చికిత్స.. అంథకారంలో ప్రధాన ఆసుపత్రి

Update: 2024-09-01 05:50 GMT

దిశ, కొత్తగూడెం : సింగరేణి సంస్థకు తలమానికంగా నిలిచే సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులకు అత్యవసరంగా చికిత్స అందించే ఐసియూ విభాగంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో చికిత్స కోసం వచ్చిన రోగులు, చికిత్స అందించే సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్ ఫోన్ లో లైట్లు ఆన్ చేసి సిబ్బంది ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రానికే విద్యుత్ వెలుగులు అందించే సింగరేణి సంస్థ కి చెందిన సింగరేణి ప్రధాన ఆసుపత్రి ఐసీయూలోనే విద్యుత్ సరఫరా లేకపోవడం ఏంటని కార్మికులు చర్చించుకుంటున్నారు. ఏదైనా కారణాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ కనీసం జనరేటర్ ని ఏర్పాటు చేయకపోవడంతో రోగులు,రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Similar News