ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి
కరకగూడెం అటవీ ప్రాంతంలోని రఘునాథపాలెం సమీపంలో పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఆరుగురు మావోయిస్టును హతమార్చడాన్ని సీపీఐ( ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు నాయిని రాజు, జిల్లా నాయకులు మాచర్ల సత్యం తీవ్రంగా ఖండించారు.
దిశ, గుండాల : కరకగూడెం అటవీ ప్రాంతంలోని రఘునాథపాలెం సమీపంలో పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఆరుగురు మావోయిస్టును హతమార్చడాన్ని సీపీఐ( ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు నాయిని రాజు, జిల్లా నాయకులు మాచర్ల సత్యం తీవ్రంగా ఖండించారు. శనివారం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్కౌంటర్ లు ఉండవని, ప్రజాస్వామికంగా పరిపాలిస్తామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయడం సరి కాదని అన్నారు. ఈ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని, ఎన్కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లో ఫోర్ట్వంటీ హామీలు ప్రకటించి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి 9 నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. రేషన్ కార్డులు, వృద్ధులు, వికలాంగుల, వితంతువుల పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్, రైతు భరోసా ,రైతు రుణమాఫీ , నిరుద్యోగం , వైద్యం, విద్య తదితర అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే పాలకులు మొద్దు నిద్ర పోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా మండల నాయకులు ఈసం శంకర్, ఆర్ఎస్పీ బోస్, వాంకుడుత్ అజయ్, కొమరం శాంతయ్య, బొర్రా వెంకన్న, గొగ్గల వెంకటేశ్వర్లు, ఈసం చంద్రయ్య, పూనెం లక్ష్మయ్య, పరిషక లక్ష్మయ్య, ఈసం సింగన్న, ఈసం కృష్ణ , తెల్లం రాజు, కోడూరి జగన్, యనగంటి గణేష్, పూనెం మంగయ్య , సనప కుమార్ ఈసం కృష్ణ, దుగ్గి రియాజ్, కల్తీ రామన్న, కల్తీ పాపన్న పాల్గొన్నారు.