Minister Ponguleti Srinivas Reddy : రైతులను రాజును చేయడమే ఈనాటి ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజును చేయడమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-08-03 13:38 GMT
Minister Ponguleti Srinivas Reddy : రైతులను రాజును చేయడమే ఈనాటి ప్రభుత్వ లక్ష్యం
  • whatsapp icon

దిశ, కూసుమంచి : రైతును రాజును చేయడమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ పాత కాలువ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టి సుమారు 31 వేల కోట్ల రూపాయలను రైతులకి ఈనాటికీ ప్రభుత్వం రుణమాఫీ చేయబోతుందని,

    దేశంలో ఏ రాష్ట్రంలోనూ నెల 15 రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం లేదని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే, చేయాలనే తాపత్రయం ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చెయ్యొచ్చు అని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. నేడు రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని, గత ప్రభుత్వం చేసిన అప్పుల భారన్ని తెలంగాణ ప్రజలతో పాటు నేటి ప్రభుత్వంపై పెనుభారం పెట్టిందని అన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటవ తారీకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రోజుకు సుమారు 16, 17 గంటలు కష్టపడి ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతులు మెచ్చుకునే

    విధంగా ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందన్నారు. ధరణి పోర్టల్ పై అసెంబ్లీలో ప్రస్తావిస్తే బీఆర్ఎస్ పార్టీ అది అద్భుతంగా ఉందని పేర్కొన్నారని తెలిపారు. వారికి తెలియని విషయం ఏంటంటే వారి ఓటమికి ప్రధాన కారణం ధరణి అని విమర్శించారు. దేశంలోని సుమారు 18 రాష్టాల్లో ఉండే రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచిని అన్నిటిని సేకరించి రోల్ మోడల్ గా దాన్ని తెలంగాణ రైతాంగానికి తీసుకురాబోతున్నామన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ మాత్రమే నాలుగు గోడల మధ్య చట్టాన్ని రూపొందించే వారని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ తెలిసే విధంగా

     కవులు, కళాకారులు, మేధావులు చివరికి గ్రామాల్లో ఉండే రైతన్న అభిప్రాయాలను సహితం సేకరించి కొత్త చట్టాన్ని రూపొందిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గంలోని కృష్ణ పరీవాహక ప్రాంతాల ప్రాజెక్టులన్నీ నిండిన సందర్భంగా పాలేరు రిజర్వాయర్ నుండి పాత కాలువ ఆయకట్టుకు నిటిని విడుదల, భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రారంభించి రైతన్నలకు సమృద్ధిగా నిరందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిళ్ ఖాన్, ఆర్డీఓ,ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News