డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్యే....

ఓ వడ్డీ వ్యాపారి ఇంటి ముందు ఓ కుటుంబం నిరసనకు దిగింది.

Update: 2024-11-29 10:51 GMT

దిశ, ఖమ్మం సిటీ : ఓ వడ్డీ వ్యాపారి ఇంటి ముందు ఓ కుటుంబం నిరసనకు దిగింది. తమకు రావాల్సిన రూ.రెండు కోట్ల 20 లక్షలను రెండు సంవత్సరాలుగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీలో నివాసముంటున్న వడ్డీ వ్యాపారి చెరుకూరి శ్రీధర్ దళిత దంపతులు తేజవతి కళ్యాణి, పరుచూరి కృష్ణమోహన్ వద్ద రూ.రెండు కోట్ల 20 లక్షలు తీసుకున్నాడు.

    రెండు సంవత్సరాల క్రితం వడ్డీ నిమిత్తం నోటు రాయించి చెక్కులు కూడా ఇచ్చాడు. కానీ రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు వడ్డీ కూడా ఇవ్వలేదని,అసలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు. నేడు డబ్బులు అడిగితే కులం పేరుతో తిడుతున్నారని బాధితులు పేర్కొన్నారు. తమకు రావాల్సిన రూ.రెండు కోట్ల 20 లక్షలు ఇచ్చేవరకు ఇక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. డబ్బులు ఇవ్వకుంటే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.  


Similar News