108 కు తాడుకట్టి లాక్కెళ్తున్న ట్రాక్టర్

గుండాల మండల కేంద్రంలోని 108 వాహనం మోరాయించటంతో ఇక్కడ ప్రజలు ఇబ్బందులు...Special News of 108 Vehicle

Update: 2023-01-28 05:37 GMT
108 కు తాడుకట్టి లాక్కెళ్తున్న ట్రాక్టర్
  • whatsapp icon

దిశ, గుండాల: గుండాల మండల కేంద్రంలోని 108 వాహనం మోరాయించటంతో ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితులు పేషెంట్ ప్రాణాలు కాపాడే 108 వాహనం గత నెల రోజులుగా తరచూ ఏదో ఒక కారణంతో ఇబ్బందులకు గురి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజల ఆరోపిస్తున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి ఒక పేషెంట్ ను తరలించడం కోసం వెళ్లిన వాహనం మోరాయించటంతో ట్రాక్టర్ కు తాడు కట్టి 108 వాహనాన్ని లాక్కు వచ్చిన దృశ్యం ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే వాహనానికే దిక్కు లేదని ప్రజల ఆరోపిస్తున్నారు. మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంతంలో 108 వాహనాన్ని కొత్తది ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 108 వాహనం పనిచేయని విషయం గతంలో ఆ శాఖ మంత్రికి విన్నవించినా ఫలితం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News