సింగరేణి ఉద్యోగులు అలర్ట్.. సీఎండీ హెచ్చరికతో సమయపాలన

విధులకు ఆలస్యంగా వచ్చిన, మాస్టర్ పడి తిరిగి వెళ్లిపోయిన కఠిన చర్యలు తప్పవని సి.అండ్. ఎం. డి బలరాం నాయక్ ఆదేశాలతో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు అలర్ట్ అయ్యారు.

Update: 2024-06-21 05:05 GMT

దిశ, కొత్తగూడెం : విధులకు ఆలస్యంగా వచ్చిన, మాస్టర్ పడి తిరిగి వెళ్లిపోయిన కఠిన చర్యలు తప్పవని సి.అండ్. ఎం. డి బలరాం నాయక్ ఆదేశాలతో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు అలర్ట్ అయ్యారు. కొంతమంది సింగరేణి యూనియన్ నాయకులు విధుల పట్ల అలసత్వం వహిస్తున్నారని అని ఫిర్యాదులు అందటంతో, సంస్థ సీ & ఎండి బలరాం నాయక్ ఇకపై అలా ఇలాంటి వారిని ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింగరేణి ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులు సమయానికి విధులకు హాజరయ్యారు. ఐదుగురు ఉద్యోగులు ఆలస్యంగా రావడం తో ఎస్.ఎన్. పి. సి సిబ్బంది వారి వివరాలను నమోదు చేసుకొని విధులకు అనుమతించారు.


Similar News