ఆర్ధిక ఉన్మాదుడు పొంగులేటి : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య..
రావణాసురుడు అని తెలుసు పార్టీలో ఎందుకు వచ్చారో..? ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూర్చొని భోజనం చేసినప్పుడు రావణాసురుడు కనిపించలేదా..? ముఖ్యమంత్రితో కలిసి హెలికాప్టర్లో తిరిగినప్పుడు రావణాసురుడు అని తెలవలేదా...? అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ రావు దుయ్యబట్టారు.
దిశ, ఖమ్మం : రావణాసురుడు అని తెలుసు పార్టీలో ఎందుకు వచ్చారో..? ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూర్చొని భోజనం చేసినప్పుడు రావణాసురుడు కనిపించలేదా..? ముఖ్యమంత్రితో కలిసి హెలికాప్టర్లో తిరిగినప్పుడు రావణాసురుడు అని తెలవలేదా...? అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ రావు దుయ్యబట్టారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఎంత మంది మీ అనుచరులను గెలిపించుకున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఏస్ పార్టీ నాయకులను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వని చెప్పటం రాజకీయ అహంకారానికి నిదర్శనం అన్నారు. ఖమ్మం ఎంపీగా ఉన్నప్పుడు జిల్లా సమస్యలపై పార్లమెంట్ లో ఏమి చర్చించారో చెప్పాలని సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు చాలా విజ్ఞావంతులు, ఆదర్శవంతులని వారు మీరు చేసే కుట్రలను అని గమనిస్తున్నారని తెలిపారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఓడించిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో మదన్ లాల్, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో ప్రజలకు తెలుసు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులోటి శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకొని పార్టీని వీడితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదుతా అన్నట్లు ఉంటుందని విమర్శించారు. ఇప్పటికైనా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గూటికి వెళ్లిన నాయకులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
ఆర్థిక ఉన్మాదుడు పొంగులేటి.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్థిక ఉన్మాదుడు ఎవరంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తన డబ్బు అహంకారంతో ఏదైనా చేయొచ్చని అనుకోవడం అవివేకం అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బజాజ్ చేతక్ పై తిరిగేవాడని ఇప్పుడు జాతీయ పార్టీలను విమర్శించే స్థాయికి వచ్చాడా విమర్శించారు. రాజకీయాల్లో కష్టపడి కార్యకర్తల సహకారంతో ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి సరైన ఆదరణ లేకపోవడంతో ప్రజల సూచనల ప్రకారం బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని, పార్టీ మారినా కూడా పార్టీ నాయకులను విమర్శించలేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలో అభ్యర్థులను నిలబెట్టారు కానీ, జనరల్ స్థానాలు ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ఇలాంటి నాయకుడిని జాతీయ పార్టీలు ఎలా తీసుకుంటున్నారని తనకి అర్థం కావట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఏస్ పార్టీ తాకిడికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ జీవితంకు శుభం కార్డు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్, నగర పాలక సంస్థ చైర్మన్ నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్. కార్పొరేటర్ కమర్తపు మురళి, డోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.