Kammam: బీసీలకు తీవ్ర అన్యాయం.. బీఆర్ఎస్ లిస్టుపై ఆర్. కృష్ణయ్య ఆగ్రహం

బీఆర్ఎస్ లిస్టులో బీసీలకు తక్కువ సీట్లు ప్రకటించడంపై బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు...

Update: 2023-08-23 09:30 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ లిస్టులో బీసీలకు తక్కువ సీట్లు ప్రకటించడంపై బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవన్‌ను ఖమ్మంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఇచ్చేది భిక్షం కాదని, వాటా అని చెప్పారు. ఎక్కువ జనభా ఉన్న బీసీలకు ఇచ్చేది 21 సీట్లేనా అని ప్రశ్నించారు. 10 శాతం ఉన్న ఓసీలకు 65 సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. 77 ఏళ్లుగా బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లో బీసీల్లో పేదరికం లేదన్నారు. మన దేశంలో 48 శాతం ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే పేదరికంలో మగ్గిపోతున్నారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారం వస్తేనే పేదరికం పోతుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని, బీసీలంతా కలిసి పోరాటం చేస్తేనే  రాజ్యాధికారం వస్తుందని ఆర్. కృష్ణయ్య తెలిపారు.

Tags:    

Similar News