ముక్కోటి వివరాలకు క్యూ ఆర్ కోడ్

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా ఈ నెల 22 న జరుగు తెప్పోత్సవం, 23 న జరగనున్న ఉత్తర ద్వార దర్శనం వేడుకలను వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు భద్రాద్రికి తరలి రానున్నారు.

Update: 2023-12-20 14:15 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా ఈ నెల 22 న జరుగు తెప్పోత్సవం, 23 న జరగనున్న ఉత్తర ద్వార దర్శనం వేడుకలను వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు భద్రాద్రికి తరలి రానున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీస్ అధికారులు ఆధునిక సాంకేతికత ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, లడ్డూ ప్రసాదం స్టాల్స్ మరియు వైకుంఠ ద్వార దర్శనం సెక్టార్ ప్లాన్ గురించి పూర్తి సమాచారం కోసం ఒక క్యూ ఆర్ కోడ్ రూపొందించారు. ఆ కోడ్ స్కాన్ చేస్తే భక్తులకు అన్ని వివరాలు తెలిసేలా తయారు చేశారు. జిల్లా ఎస్పీ వినీత్ జి బుధవారం క్యూ ఆర్ కోడ్ విడుదల చేశారు. 


Similar News