విలేకరుల పేరుతో బెదిరింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

జూలూరుపాడు గ్రామం లోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లి పేరుతో గుండెపుడి గ్రామానికి చెందిన బోడా శ్రీను చికెన్ సెంటర్ నిర్వహిస్తాడు.

Update: 2025-04-04 15:51 GMT

దిశ/జూలూరుపాడు: జూలూరుపాడు గ్రామం లోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లి పేరుతో గుండెపుడి గ్రామానికి చెందిన బోడా శ్రీను చికెన్ సెంటర్ నిర్వహిస్తాడు. బోడా శ్రీనును కొందరు విలేకరులమని బెదిరించడంతో జూలూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూలూరుపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడా శీను నిర్వహిస్తున్న చికెన్ సెంటర్ లోకి తంబర్ల నరసింహారావు, కంచె పోగు నరసింహారావు అనే వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, తాము విలేకరులమని చెప్పి తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ తో వీడియోలు తీస్తూ, తమకు పదివేల రూపాయలు ఇవ్వాలని లేకపోతే చచ్చిన కోళ్లను, పురుగుల పడ్డ కోళ్లను, రోగాలతో ఉన్న కోళ్లను అమ్ముతున్నావని, పేపర్లో రాస్తామని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని తెలిపారు. 10,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని సుమారు 30 నిమిషాలు షాపులో నుండి బయటకు రాకుండా చేశారని, తన చికెన్ షాప్ గురించి అసత్య ప్రచారం చేస్తామని తాము ప్రెస్ లో పని చేస్తామని బెదిరించారిని పేర్కొన్నారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాదావత్ రవి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News