హిడ్మా కోటలో పోలీసుల పాగా..
మావోయిస్టు అగ్ర నేత హిడ్మా కోటలో భద్రతా బలగాలు పాగా వేశాయి. దీంతో సుక్మా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మరో అడుగు ముందుకేసినట్లు అయింది.
దిశ, భద్రాచలం : మావోయిస్టు అగ్ర నేత హిడ్మా కోటలో భద్రతా బలగాలు పాగా వేశాయి. దీంతో సుక్మా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మరో అడుగు ముందుకేసినట్లు అయింది. నక్సలైట్ బెటాలియన్ కోర్ ఏరియా మేటగూడంలో భద్రతా బలగాలు కొత్త క్యాంపు ప్రారంభించారు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్, సీఆర్పీఎఫ్ డీఐజీ సైనికులతో కలిసి మేటగూడం చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో నక్సలైట్ కమాండర్ హిడ్మా ఉన్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందినట్టు సమాచారం.