తహసీల్దార్​పై ఎంపీఓ బూతు పురాణం

తహసీల్దార్​పై ఎంపీఓ బూతు పురాణం లంకించుకున్న ఆడియో క్లిప్పింగ్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తుంది.

Update: 2024-03-30 10:51 GMT

దిశ, కరకగూడెం : తహసీల్దార్​పై ఎంపీఓ బూతు పురాణం లంకించుకున్న ఆడియో క్లిప్పింగ్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తుంది. ఆయన వాడిన పదజలాన్ని యధాతధంగా ఎవరూ రాయలేదు. ఒకవేళ రాద్దామనుకున్నా సాధ్యం కాదు. ఎందుకంటే అంత ఘాటుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మరి. మండల పరిషత్ కార్యాలయంలో

    ఎంపీఓగా విధులు నిర్వహిస్తు కుమార్ ఉన్నత అధికారిగా మండలంలో సౌమ్యుడిగా పేరుంది. కానీ ప్రస్తుతం విడుదలైన ఆడియో క్లిప్ ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. ఒక మండలం మెజిస్ట్రేట్ అధికారి అయిన తహసీల్దార్ పై బండ బూతులు తిట్టిన ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకు ఇదే సాక్ష్యం అంటూ ఫోన్లో ఆ ఆడియో క్లిప్ ను తహసీల్దార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ఆడియో మండలంలో హల్ చల్ చేస్తుంది. 


Similar News