ఖమ్మం బహిరంగ సభ దేశ చరిత్రలో నిలవాలి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఖమ్మం సభ దేశ చరిత్రలో నూతన అధ్యాయంగా నిలవాలని ఎమ్మెల్యేలు లావుడ్యా రాములు నాయక్, క్రాంతి కిరణ్ అన్నారు.

Update: 2023-01-17 13:16 GMT

దిశ, వైరా : ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ దేశ చరిత్రలో నూతన అధ్యాయంగా నిలవాలని వైరా, ఆందోల్ ఎమ్మెల్యేలు లావుడ్యా రాములు నాయక్, క్రాంతి కిరణ్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా దేశ నూతన రాజకీయాలకు వేదిక కావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఈ సభ ద్వారా ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొట్టి దేశంలో అమలు చేస్తోందని ఆరోపించారు. దేశంలోని రైతులందరికీ బీఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వైరా సరిహద్దు ప్రాంతాల్లోని ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల సాధన సమితి చైర్మన్ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ , వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, మార్కెట్ చైర్మన్ బీడీకే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ ,జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్ ,పట్టణ అధ్యక్షులు ధార్ణ రాజశేఖర్, రూరల్ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, దిశ కమిటీ సభ్యులు కట్ట కృష్ణార్జునరావ్ ,జిల్లా నాయకులు మచ్చా బుజ్జి ,సోషల్ మీడియా కన్వీనర్ మాటపోతుల సురేష్, చాపల సొసైటీ చైర్మన్ ఎస్కె రహీం ,మిషన్ భగీరథ అధ్యక్షులు మద్దెల రవి ,కౌన్సిలర్స్ వనమా విశ్వేశ్వరరావు,లక్ష్మీబాయి , దారెల్లి పవిత్ర కుమారి,డాక్టర్ కోటయ్య, పట్టణ నాయకులు పనితి సైదులు, మరికంటి శివ, ఎదునూరు శ్రీను ,కర్నాటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News