మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం

Update: 2024-08-09 08:54 GMT


దిశ ప్రతినిధి, కొత్తగూడెం : మహిళలు ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ధానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలం, అశోక్ నగర్ గ్రామ పంచాయతీలో కోటి యాభై లక్షల నిధులతో మంజూరైన సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. దాంతో పాటు జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించడంకోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని అన్నారు.

గత పాలకుల వైఫల్యాలను గుర్తించి ఏలాంటి పొరపాట్లు జరగకుండా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడంలో ముందు వరుసలో ఉన్నామని అన్నారు. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని, ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా శక్తి క్యాంటీన్ ను మంచిగా నిర్వహించుకుని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, సీసీఎఫ్ భీమానాయక్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News