పార్టీ బహిష్కుృతులకు పదవీ గండం

బీఆర్ఎస్ లో ఉండి పదవులు అనుభవిస్తూ.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో చేరిన వైరాలోని ముగ్గురు నాయకులకు పదవీ గండం పొంచి ఉంది.

Update: 2023-02-06 10:14 GMT

ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న బీఆర్ఎస్

దిశ, వైరా: బీఆర్ఎస్ లో ఉండి పదవులు అనుభవిస్తూ.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో చేరిన వైరాలోని ముగ్గురు నాయకులకు పదవీ గండం పొంచి ఉంది. ముందుగా స్థానిక ఎమ్మెల్యే తన చేతిలో ఉన్న రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పదవిలో కొనసాగుతున్న సదరు వ్యక్తిన మరో పది రోజుల్లో తొలగించనున్నారు. అదేవిధంగా మిగిలిన ఇద్దరిని కూడా అన్ని రకాల పదవుల నుంచి తొలగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సంసిద్ధమవున్నట్లు తెలస్తోంది. వివరాల్లో వెళితే.. వైరా ఎమ్మెల్యే అభ్యర్థి విజయబాయి అదివారం పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో ఆయన వర్గంలో చేరారు. ఈ కార్యక్రమానికి వైరా మార్కెట్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు మిట్టపల్లి నాగి హాజరయ్యారు. వీరితో పాటు వైరా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ లో ప్రాతనిధ్యం వహిస్తున్న సుమారు 20 మంది నాయకులు ఈ కార్యక్రమానకి హాజరయ్యారు. దీంతో, బీఆర్ఎస్ పార్టీ వారందరిపై బహిష్కరణ వేటు వేసింది. ఈ నేపథ్యంలో పొంగులేటి వర్గంలో చేరిన బీఆరఎస్ నాయకుల పదవులపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముందుగా ఎమ్మెల్యే తన చేతిలో ఉన్న రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పదవి నుంచి మిట్టపల్లి నాగేశ్వరరావు అలియాస్ నాగిని తొలగించేందుకు రంగం సిద్ధం సిద్ధమైంది. ఈ పదవివో ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న వారిలో ఎవరిని నియమించాలనే విషయమై జిల్లా నాయకత్వం అన్వేషిస్తొంది. అదేవిధంగా మార్కెఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ పదవి నుంచి బొర్రా రాజశేఖర్ ను ఆ పదవి నుంచి తొలగించనున్నారు. వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతగాని జైపాల్ పదవికి కూడా గండం ఏర్పడింది. ఇప్పటికే తిరుగుబాటు నాయకులపై చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు పార్టీ వల్ల వారికి లభించిన పదవుల నుంచి తొలగించేందుకు పావులు కదుపుతున్నారు.

ఇప్పుడే వద్దు.. వేచి చూద్దాం

పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని బహిరంగంగా విమర్శిస్తుండటంతో వైరా నియోజకవర్గ రాజకీయం రసకందాయంగా మారింది. పార్టీ నుంచి బహిష్కరణ గురైన నేతలు ప్రస్తుతం పార్టీలో పదవుల్లో కొనసాగుతున్న పలువురు నేతలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంలోకి రావాలని కోరుతున్నారు. వైరాలో పలువురి నేతలపై సోమవారం ఒత్తిడి తీవ్ర స్థాయికి చేరింది. దీంతో కొంతమంది నేతలు ఇప్పుడే వద్దు.. వేచి చూద్దామని ధోరణిలో ఉన్నారు. వైరాలోని ఓ కౌన్సిలర్, వైరా మత్స్య పారిశ్రామిక సంఘ చైర్మన్, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు తో పాటు పలువురు నాయకులుపై ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. వారంతా ప్రస్తుత పరిస్థితిని గమనించి సున్నితంగా ఇప్పుడు రాలేమని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే తమను పార్టీ నుంచి బహిష్కరించి నందున కొంతమంది నాయకులు అయినా బీఆర్ఎస్ కు రాజీనామా చేయించి పొంగిలేటి వర్గంలోకి తీసుకువెళ్తే తమ మార్క్ రాజకీయం నిలబడుతుందని ఆ నాయకులు భావిస్తున్నారని సమాచారం. వైరా మున్సిపాలిటీలోని అత్యధిక మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ ను వీడెందుకు సిద్ధంగా లేరని సమాచారం. ఏది ఏమైనా వైరా నియోజకవర్గ రాజకీయం రసకందాయంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News