ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు
డీఎస్సీలో ఉద్యోగం పొందిన జీళ్లచెరువు గ్రామానికి చెందిన మండవ హరికృష్ణ కుమార్తె ప్రియాంక, అలాగే కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన రెండవ కుమార్తె ఉదయశ్రీ లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు.
దిశ, కూసుమంచి : డీఎస్సీలో ఉద్యోగం పొందిన జీళ్లచెరువు గ్రామానికి చెందిన మండవ హరికృష్ణ కుమార్తె ప్రియాంక, అలాగే కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన రెండవ కుమార్తె ఉదయశ్రీ లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. డీఎస్సీ లో 11వ ర్యాంక్ సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన మండవ ప్రియాంకకు గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో నియామక పత్రాన్ని అందించారు. కాగా శుక్రవారం కూసుమంచి క్యాంప్ కార్యాలయంకు వచ్చిన ప్రియాంక, కొత్తగూడెంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆమె సోదరి ఉదయశ్రీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రికి వివరించారు.
కాగా వీరి తండ్రి మండవ హరికృష్ణ ఫారెస్ట్ లో ఉద్యోగం చేస్తుండగా కుమార్తెలు కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందడంతో వీరి ఇంట్లో ముగ్గురు గవర్నమెంట్ కొలువులు కలిగి ఉన్నారు. దాంతో మంత్రి పొంగులేటి వారిని అభినందించారు. స్పీట్ తినిపించి శాలువాలు కప్పి సన్మానించారు. అలాగే ఖమ్మం, కూసుమంచి క్యాంప్ కార్యాలయాల ఇన్చార్జ్లు తుంబురు దయాకర్ రెడ్డి, బీంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వారిని అభినందించారు. మంత్రి వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొక్క ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు పెండ్ర అంజయ్య, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, ఇంటూరి పుల్లయ్య, చిలకబత్తిని రామారావు, గోపి సింహాద్రి ఉన్నారు.