Minister Ponguleti Srinivasa Reddy :ఇక నుంచి వేగంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు

పేదల ఆరోగ్య భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇక నుంచి వేగంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

Update: 2024-08-04 11:19 GMT

దిశ కూసుమంచి/నేలకొండపల్లి : పేదల ఆరోగ్య భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇక నుంచి వేగంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో 140 మందికి రూ.38.33లక్షలు, కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో 161మందికి రూ.46.20 లక్షలు మొత్తం రూ.84.53 లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... పేదల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తమ ప్రభుత్వం వచ్చిన కొద్దికాలంలోనే ఆరోగ్యశ్రీని విజయవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ఇంకా ఇలా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసాను అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పేదల వైద్యానికి కూడా డబ్బులు వెచ్చించలేదని, తాము నిధులు కేటాయించి మంజూరు చేయిస్తున్నామని అన్నారు. ఇకపై జాప్యం నెలకొనకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులను రోగి దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోపే చెక్కు మంజూరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు.

విపక్షానిది అవివేకం..

కాంగ్రెస్ వచ్చింది నీటి, కరెంట్ కష్టాలు వచ్చాయంటూ విపక్ష బీఆర్ఎస్ నాయకులు విమర్శించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టులన్నీ నిండాయన్న సంగతి గ్రహించకపోవడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. కరెంట్ కోతల ఊసే లేకుండా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో.. మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర

    ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, కూసుమంచి, నేలకొండపల్లి ఎంపీపీలు బాణోతు శ్రీనివాస్, వజ్జా రమ్య, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షులు మట్టె గురవయ్య, నాయకులు శాఖమూరి రమేష్, మంకెన వాసు, కొడాలి గోవిందరావు, ఎంపీటీసీ వంగూరి ఉష, చంద్రశేఖర్, బోయిన వేణు, పెండ్ర అంజయ్య, రాం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News