నిన్నకాక మొన్న వచ్చిన వారికి టికెట్​ ఇస్తారా

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు బుధవారం ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావాహులు ధర్నాకు దిగారు.

Update: 2023-10-25 15:31 GMT

దిశ, ఇల్లందు : ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు బుధవారం ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావాహులు ధర్నాకు దిగారు. 2014, 2018లో ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అభ్యర్థులు వారి స్వలాభం కోసం పార్టీ మారి, కార్యకర్తలను మోసం చేశారని, పది సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డ, జెండా మోసిన 32 మంది కాంగ్రెస్ ఆశావాహులలో ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి గెలిపించుకుంటామన్నారు. 2014 లో కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన కోరం కనకయ్యకు టికెట్ కేటాయించవద్దని సేవ్ కాంగ్రెస్ సేవ్ ఇల్లందు, పారాషూట్ కో హటావో ఇల్లందు కో బచావో అనే నినాదాలతో ఏఐసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆశావాహులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో దల్ సింగ్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు, కామేపల్లి జెడ్పీటీసీ వెంకట ప్రవీణ్ నాయక్, నాగేందర్ నాయక్, విజయలక్ష్మి, శంకర్ నాయక్ ,లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News