బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితం అంధకారమైంది: CPM
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన పరిస్థితి
దిశ,కొత్తగూడెం : బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన పరిస్థితి అంధకారంలోకి నెట్టి వేసినట్లు అయిందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు విజయ్ రాఘవన్ అన్నారు. సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర ముగింపు సభ సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల బతుకులకు సంబంధించిన సమస్యపై సీపీఎం రాష్ట్ర కమిటీ యాత్ర నిర్వహించందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని అన్నారు.
అయినా ప్రజల బాధలు పట్టించుకోకుండా తన మిత్రులు కార్పొరేట్ సభ్యులకు లాభాలు తెచ్చిపెట్టడం కోసం దేశ సంపదను కట్టబెట్టడానికి ఉవ్విలూరుతున్నారని విమర్శించారు.దేశంలో నిరుద్యోగం నలభై శాతానికి పెరిగిందని వారి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయట్లేదని అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించి తక్కువ సీట్లు ఇచ్చారని కొన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చి అధికారం ఇవ్వడానికి సహకరించాయని అన్నారు. వారికి బహుమతిగా సింగరేణి బొగ్గు బ్లాకులను కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించే దమ్ము ఎర్రజెండాకు మాత్రమే ఉందని అన్నారు.సింగరేణి ప్రైవేటీకరించం అంటూనే బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగిస్తాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య
తెలంగాణలో సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగిస్తాం అని వీరయ్య అన్నారు.అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని కోరారు. సింగరేణి వేలం ప్రక్రియ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.సింగరేణి ప్రైవేటీకరణ అయితే సింగరేణి కుటుంబాలకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా నష్టమే అని అన్నారు.ప్రజల సంపదను భావితరాలకు అందించడం కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ ఆశయ్య,కాసాని ఐలయ్య మందా నరసింహారావు,జగదీష్,మచ్చా వెంకటేశ్వర్లు, ఏ జే రమేష్,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం జ్యోతి, లిక్కీ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.