టీఎన్జీవోస్ ఆఫీస్ లో మొదలైన రచ్చ..
బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మరునాడే టీఎన్జీవోస్ యూనియన్ లో రచ్చ రచ్చ మొదలైంది.
దిశ, ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మరునాడే టీఎన్జీవోస్ యూనియన్ లో రచ్చ రచ్చ మొదలైంది. అధికార ముసుగులో చేసిన లుకలుకలు బయటపడ్డాయి. మా సంఘానికి సమయం ఉన్న రద్దు చేశారు అంటూ ఇరువురి ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగా రచ్చకు దిగారు. వివరాలోకి వెళ్ళితే టీఎన్జీవోస్ ఉద్యోగ సంఘాల నాయకులు సోమవారం ఖమ్మం నగరంలో ఉన్న కార్యాలయంలో ఇరువురి నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ సంఘం కమిటీ ఉన్నాకూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాష్ట్ర కమిటీని అడ్డం పెట్టుకొని ప్రస్తుత సంఘం అధ్యక్షుడు అఫ్జల్ హసన్, సాగర్ ఇద్దరు కలిసి ఎలా వేస్తారు అంటూ గతంలో ఉన్న నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరిపై ఒక్కరు నెట్టుకుంటూ సై అంటే సై అంటూ ఘర్షణకు దిగారు. స్థానిక కార్పొరేటర్ భర్త మిక్కిలినేని నరేందర్ జోక్యంతో ఇరువురి ఉద్యోగ సంఘాల నాయకులను శాంతించి రాష్ట్ర నాయకత్వం తీరు పై నిర్ణయం తీసుకోవాలని ఆఫీస్ గేటుకు తాళం వేసి పోలీసుల సహాయంతో బయటకు పంపించారు. ఈ తతంగం వెనుక ఇంత రాజకీయం ఉందా అంటూ సంఘం ఆఫీస్ చుట్టూ ఉన్న ప్రజలు చెప్పుకోవడం కొసమెరుపు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అడ్డం పెట్టుకొని అరాచకాలు చేశారు.. ఏలూరి శ్రీనివాసరావు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ను అడ్డం పెట్టుకొని మా ప్యానల్ ఉన్నాకూడా అక్రమంగా మరొక సంఘాన్ని తయారు చేసి ఏకగ్రీవంగా ఎన్నిక చేశారని టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకులు ఏలూరి శ్రీనివాసరావు ఆరోపించారు. మా నగర, జిల్లా ప్యానెల్ లో ఉన్న ఉద్యోగస్తులను వేరే జిల్లాలకు బదిలీ చేయించిన ఘనుడు అఫ్జల్ హాసన్ అంటూ ఆరోపించారు. రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంఘంలో లేని ఉద్యోగస్తులతో ఎలా నిర్ణయం తీసుకుంటారని డిమాండ్ చేశారు. ఎన్నికల ద్వారా మా ప్యానెల్ గెలిచిన ఆధారాలు ఉన్నాయని, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలని సవాల్ చేశారు.
నీకు దమ్ముంటే ఎన్నికల ద్వారా గెలువు.. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హాసన్..
నీకు దమ్ముంటే ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో గెలిచి చూపించు అంటూ ఏలూరి శ్రీనివాసరావుకు అఫ్జల్ హాసన్ సవాల్ చేశారు. మా ప్యానెల్ రాష్ట్ర నిర్ణయం మేరకు జరిగిందని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు చేయలేదన్నారు. మా ప్యానెల్ ఎన్నుకునే సమయంలో వారి సంఘం నాయకులే తీర్మానం చేస్తారని అన్నారు. అధికారిని అడ్డం పెట్టుకొని మా మీద దాడులు చేయడం సరైంది కాదన్నారు.