మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఇలా వచ్చాడు.. అలా తెంపుకుని పారిపోయాడు..

మండల పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు హడలెత్తిస్తున్నాయి. ఒక ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2023-04-17 15:20 GMT

దిశ, నేలకొండపల్లి : మండల పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు హడలెత్తిస్తున్నాయి. ఒక ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ముఠాపురం ఘటన కలకలం రేపుతుంది. ముఠాపురం గ్రామానికి చెందిన భాగం కస్తూరి(50) అనే మహిళను పల్సర్ బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి మంచి నీళ్ళు అడగడంతో ఇచ్చేందుకు ఇంట్లోకి వెళ్ళింది. కస్తూరి మెడలో ఉన్న గొలుసు చూశాడు. మంచినీళ్ళు ఇచ్చే లోపే అతను ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు తాడు లాక్కొని వెళ్ళాడు.

వచ్చిన దుండగుడు నల్ల పాయింట్, బ్లూ కలర్ షర్టు ధరించి, హెల్మెట్ పెట్టుకుని ద్విచక్రవాహనంపై వచ్చినట్లు ఆమె చెబుతుంది. మెడలోని బంగారు గొలుసును క్షణాల్లోనే తెంపుకుని తిరిగి బైక్ వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. కస్తూరి తేరుకుని స్నాచర్‌ను పట్టుకునేందుకు వెంట పడినప్పటికీ ఫలితం లేకపోయింది. వృద్ధురాలు కావటంతో.. ముందే ఉన్నా పట్టుకోలేకపోయింది. ఇక చేసేదేమీ లేక బాధితురాలు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News