ప్రచార హోరు.. ఉదయం 6 గంటలకే అభ్యర్థుల పర్యటనలు

అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు.. ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

Update: 2023-11-19 03:39 GMT

దిశ, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు.. ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వివరిస్తున్నారు. తమకే ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలకు చెందిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రోడ్ షో, మీటింగ్‌లతో కాంగ్రెస్ పార్టీకి మరింత నూతన ఉత్సాహాన్ని నింపింది.

బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభతో బీఆర్ఎస్ పార్టీకి జోష్ ను నింపింది. రేపు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్ టూర్ ఖరారైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సభలు, రోడ్ షోలో పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు‌. ఇంటింటికీ తిరుగుతూ.. అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వివరిస్తున్నారు. తమకే ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

ఉదయం 6 నుంచే ప్రచారం షురూ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విజయం సాధించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్లిపోతున్నారు. వారు నిర్ణయించుకున్న షెడ్యూల్ టూర్ ప్రకారం గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా సమయం వృధా చేయకుండా ప్రతి ఓటర్లకు దగ్గర అయ్యేలా ప్రసంగాలు చేస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు గ్రామాల్లో, మండల కేంద్రంలో ప్రచారాలు జోరు పెంచుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రతి మండల, గ్రామ, డివిజన్ల వారీగా ప్రచార రథంల ద్వారా నేరుగా ఓటరు వద్దకు వెళ్లి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా, నియోజకవర్గాల్లో అభ్యర్థులు గడప, గడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

సంక్షేమ పథకాలు వివరిస్తూ, మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్టు గురించి ఓటర్లు ఆకర్షిస్తున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం వారు చేసిన పోరాటాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులు కూడా తాము ఏమైనా తక్కువ అంటూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా సమాచారం మెసేజ్ రూపంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గంలో అభ్యర్థులు అరటి పండ్లు అమ్ముతూ, ఇస్త్రీ , టీ, టిఫిన్, క్షవరం చేస్తూ ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఇంకా 10 రోజులు మిగిలి ఉంది. అభ్యర్థులు ఇంకా ఓటరుకు దగ్గర అయ్యే విధంగా వినూత్న రీతిలో ప్రచారం చేయనున్నారు.

పార్టీ అగ్రనేతలు రావడంతో జోష్..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని రావడంతో ప్రచారాలు మరింత రంజుగా సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గంలో 7 సభల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభలు నిర్వహించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నేను రాహుల్ గాంధీ పినపాక రోడ్ షో, ఢిల్లీ స్థాయి నేతల ప్రచారాలు పార్టీ అభ్యర్థులను నూతన ఉత్సాహాన్నిచ్చే విధంగా ఉందని నాయకులు చెబుతున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారం 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.

Tags:    

Similar News