మానవతరాయ్‌పై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం..

నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ, ప్రజలే జీవితంగా బతుకుతున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యను విమర్శిస్తే మర్యాదగా ఉండదని, రాయ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.

Update: 2023-05-04 06:24 GMT

దిశ సత్తుపల్లి : నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ, ప్రజలే జీవితంగా బతుకుతున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యను విమర్శిస్తే మర్యాదగా ఉండదని, రాయ్ ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బుధవారం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన రాయ్ ,ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావని, ఎక్కడ ప్యాకేజీలు తీసుకుంటున్నావని ప్రశ్నించారు. సంక్రాంతికి ఓసారి వచ్చే గంగిరెద్దులా వచ్చి మాట్లాడటం సరి కాదని ,ప్రజలే జీవితంగా పయనిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న శాసనసభ్యులు సండ్రను విమర్శించే స్థాయి నీకు లేదని, సెంటర్ను విమర్శించినంత మాత్రాన నువ్వు పెద్దోడివి అయిపోవని హితవు పలికారు.

ఆరోగ్యం బాగోలేక రెండు రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్న శాసనసభ్యులపై కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం రాజకీయ అనుభవారహిత్యమని విమర్శించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి అందిస్తున్న సెంటర్ లాంటి శాసనసభ్యులను విమర్శించే ముందు ఓసారి ఆలోచించుకోవాలని సూచించారు‌. సత్తుపల్లి శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, మనోభావాలను దెబ్బతీసినందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో టిపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ మీద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు ,మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మట్టా ప్రసాద్, చాంద్ పాషా, నాగుల్ మీరా, రఘు,మారుతి సూరిబాబు, పట్టణ కార్యదర్శి మల్లూరి అంకమ్మరాజు, వల్లభనేని పవన్ నడ్డి ఆనందరావు అబ్దుల్లా ,నరుకుళ్ళ శ్రీను, మేకల నరసింహారావు, మిద్దె శ్రీను ,వలి, వేణు, రాజ్ కుమార్, సతీష్, గఫార్,కంటే అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News