ఎమ్మెల్యే గా ఆశీర్వదించండి

కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే గా ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు ఓటర్లను అభ్యర్థించారు.

Update: 2023-11-03 11:53 GMT

దిశ, మధిర : కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే గా ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీలోని 9, 10 వార్డుల్లో గడపగడపకు వెళ్లి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ సహకారంతో మధిర పట్టణంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం సహా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, ఇండోర్ స్టేడియం ఏర్పాటు లాంటి అభివృద్ధిని మధిర పట్టణానికి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.

    జరిగిన కోట్ల రూపాయల అభివృద్ధి తో మధిర పట్టణ రూపురేఖలు మారాయని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా పరిపాలనందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించనున్నట్టు తెలిపారు. అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. ఆరోగ్య రక్ష కింద రూ. 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీని వర్తింప చేయడం జరుగుతుందని, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీమా కింద ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. కారు గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News