ఉద్యోగాలు కావాలంటే బీఆర్​ఎస్​ను తప్పించండి

అమరుల త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణలో గత పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్న కేసీఆర్​ను తప్పించి కాంగ్రెస్​ను గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జాతీయ కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు.

Update: 2023-11-25 10:58 GMT

దిశ, ఖమ్మం రూరల్ ​: అమరుల త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణలో గత పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్న కేసీఆర్​ను తప్పించి కాంగ్రెస్​ను గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జాతీయ కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంకగాంధీ అన్నారు. శనివారం రూరల్​ మండలం నాయుడుపేట వద్ద ప్రియాంక గాంధీ రోడ్​షోక్​కు పాలేరు బీఆర్ఎస్​ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్​ మిటింగ్లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్​ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, ఇక్కడ యువతకు మాత్రం మొండి చెయ్యి చూపినట్లు ఆమె తెలిపారు.

    కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా .. అని ఆమె ప్రశ్నించారు. మీకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలని యువతను ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్ర రైతులు, ఆడబిడ్డలు, యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుందన్నారు. మీ అందరికీ ఒక కల ఉంటుందని, ఆ కల ఇంకా నిజం కాలేదని, కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతి ఒక్కరి కలను సాకారం చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయిందన్నారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ ఉద్యోగాలు వచ్చాయన్నారు.

     అందరికీ ఉద్యోగాలు, ఇళ్లు వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతుల రుణాలు మాఫీ, 24 గంటల కరెంట్​తో పాటు ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేసే శక్తి వంత మైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస రెడ్డిని, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావును, మధిరలో భట్టివిక్రమార్క ను గెలిపించాలన్నారు. మీరు తనపై చూపించిన ప్రేమ, అప్యాయత జీవితంలో మరిచిపోలేనివి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్​, ధరావత్​ రామ్మూర్తినాయక్​, నాలుగు మండలాలకు చెందిన కాంగ్రెస్​ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. 

Tags:    

Similar News