బాలికల వసతి గృహంలో వంటమనిషిగా పురుషుడు

పదవ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ వంటి పలు కోర్సులలో విద్యను అభ్యసిస్తూ వసతి గృహంలో ఉంటున్న బాలికల హాస్టల్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా మగ వంట మనిషిని నియమించారు.

Update: 2024-09-21 05:59 GMT

దిశ, కొత్తగూడెం: పదవ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ వంటి పలు కోర్సులలో విద్యను అభ్యసిస్తూ వసతి గృహంలో ఉంటున్న బాలికల హాస్టల్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా మగ వంట మనిషిని నియమించారు. కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని ఏ- పవర్ హౌస్ బస్తీలో ఉన్న గిరిజన బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో 230 మంది విద్యార్థినిలు ఉంటున్నారు. నిబంధనల ప్రకారం పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో సిబ్బంది మహిళలే ఉండాలి. అత్యవసర పరిస్థితిలో సిబ్బంది కొరత ఉండి పురుషులని నియమించాల్సి వస్తే 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళని నియమించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఒక యువకుడిని వంట మనిషిగా నియమించారు. ఏకంగా సదరు వ్యక్తి బాలికల హాస్టల్ లోనే నివాసం ఉంటున్నాడు. బాలికల హాస్టల్ లోకి పురుషులు ప్రవేశించడం నిషేధం, అటువంటిది ఏకంగా ఒక యువకుడిని వంట మాస్టర్‌గా నియమించడం ఏంటి? సదరు వ్యక్తిని హాస్టల్లోనే మకాం పెట్టించడమేమిటని పలు విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు.


Similar News