కూసుమంచిలో 100పడకల ఆసుపత్రి.. మంత్రి చొరవతో మోక్షం

Update: 2024-09-26 14:20 GMT

దిశ, ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలేరు నియోజకవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయి. కూసుమంచి మండలంలో మెరుగైన వైద్యం కోసం ప్రజలు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో కూసుమంచి మండలంలో 100 పడకల ఆసుపత్రికి మోక్షం లభిస్తుంది. కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామంలో సర్వే నెంబర్ 12లో 5.10 గుంటల భూమికి గ్రీన్ సిగ్నల్ అందింది.

100 పడకల ఆసుపత్రి, మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. శుక్రవారం 5.10 గుంటల భూమిని జిల్లా వైద్య విధాన పరిషత్ కు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూసుమంచి మండలంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు అయితే అక్కడ ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది. కాగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 100 పడకల ఆసుపత్రికి మోక్షం లభిస్తున్నదని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News