ఆ వివరాలన్ని సీబీఐకి ఇస్తా.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ సీబీఐ, ఐటీ, ఈడీని వాడుతుందని ముందే చెప్పామని.. అంతా తాము ఊహించినట్లుగానే జరుగుతోందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-26 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ సీబీఐ, ఐటీ, ఈడీని వాడుతుందని ముందే చెప్పామని.. అంతా తాము ఊహించినట్లుగానే జరుగుతోందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కొనడం కోసం బీజేపీ ఏ రకంగా ప్రయత్నం చేసిందో.. ఆ వివరాలన్నీ సీబీఐకి ఇస్తానని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందుతో తనకు పరిచయం ఉందని.. కానీ అతడితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News