టీ.కాంగ్రెస్‌లో అదృష్టం చేజార్చుకున్న నేతలు

తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ అనంతరం తొలిసారి అధికారాన్ని కొల్పోయింది.

Update: 2023-12-04 11:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ అనంతరం తొలిసారి అధికారాన్ని కొల్పోయింది. ఒక దశలో ఉనికే లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారం దక్కించుకోవడం సంచలనంగా మారింది. అయితే తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఈ అధికారానికి ముంగిట్లో పలువురు సీనియర్లు కాంగ్రెస్‌ను వీడి అధికార పక్షంలో ఉండే అదృష్టాన్ని దూరం చేసుకున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, గాలి అనిల్ కుమార్, పాల్వాయి స్రవంతి, మేడ్చల్, మెదక్, గద్వాల్ డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, విద్యార్థి నేత మానవతారాయ్ తదితరులు ఉన్నారు.


వీరంతా తమకు టికెట్లు దక్కలేదని పార్టీని వీడారు. అయితే సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తున్నామని, అధికారంలోకి రాబోయేది మన పార్టీయేనని అధికారంలోకి వచ్చాక అర్హతలను బట్టి సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ భరోసా ఇచ్చినా కాంగ్రెస్‌ను వీడారు. పార్టీ మారినా వారికి టికెట్లు దక్కలేదు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలోకి రాగా వారంతా ప్రతిపక్ష నేతలుగా మారిపోయాపోరు. దీంతో పార్టీ మారే విషయంలో కాస్త ఓపిక పట్టి ఉంటే బాగుండేదని వారి అనుచరులు, సన్నిహితులు వాపోతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News